హైడ్రా, GHMC కేవలం పేదల ఇళ్లనే కూలుస్తోంది: తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హైడ్రా, GHMC కేవలం పేదల ఇళ్లనే కూలుస్తోంది: తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
High court


హైదరాబాద్, 02 జూలై (హి.స.)

చెరువుల ఆక్రమణ, ఎఫ్ఎఎల్ (FTL)

పరిధిలోని అక్రమ నిర్మాణాల నిర్మూలనకు పుట్టుకొచ్చిన హైడ్రా (HYDRAA), జీహెచ్ఎంసీ (GHMC)తో కలిసి కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ తార్నాకలోని ఎర్రకుంట ఆక్రమణలపై సీనియర్ న్యాయవాది విజయ్ గోపాల్ (Vijay Gopal) దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది.

అయితే, ఈ సందర్భంగా 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకుంట చెరువు క్రమక్రమంగా ఆక్రమణలకు గురవుతూనే వస్తుందని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, హైడ్రా, లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పిటిషనర్ తన వాదనలు పకడ్బందీగా వివరించారు. ఈ క్రమంలోనే ధర్మాసనం కలుగజేసుకుని.. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాళ్లు కేవలం పేదోళ్ల ఇళ్ల మీదే పడ్డారని, వాళ్ల ఇళ్లను మాత్రమే టార్గెట్గా చేసుకుని కూలుస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి అసలైన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా, నీటి పారుదల శాఖలకు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కేసులో తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande