జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఆందోళన
జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఆందోళన
Bjp


జహీరాబాద్, 02 జూలై (హి.స.)

జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో

నెలకొన్న సమస్యలపై బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ నాయకులు స్థానిక ఇన్చార్జ్ డాక్టర్ కిరణ్ను కలిసేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో నిరసనగా ఖాళీ కుర్చీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు పూల సంతోష్ మాట్లాడుతూ.. స్థానిక ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని విమర్శించారు. వైద్యులు, సిబ్బంది, మందుల కొరత, పారిశుద్ధ్య లోపం, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande