ఢిల్లీలో ఘోర ప్రమాదం: హరి నగర్ నివాస భవనం పార్కింగ్లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది రక్షణ
ఢిల్లీలో ఘోర ప్రమాదం: హరి నగర్ నివాస భవనం పార్కింగ్లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది రక్షణ
fire


న్యూఢిల్లీ , 21 జూలై (హి.స.)

ఢిల్లీలోని హరి నగర్ ఫతే నగర్ ప్రాంతంలో ఉన్న ఒక నివాస భవనం పార్కింగ్ స్థలంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా పార్కింగ్‌లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింతగా వ్యాపించి నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దట్టమైన మంటలు, పొగల మధ్య భవనంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది నివాసితులను ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా రక్షించారు. జైల్ రోడ్ రణబీర్ బేకరీ సమీపంలోని ఓ ఇంట్లో ఈ ప్రమాదం జరిగిందని అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రవి నాథ్ తెలిపారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇదిలావుండగా, గత ఆదివారం కూడా ఢిల్లీలోని ఫతేపూర్ బేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వరూప్ కాలనీలో ఉన్న ఈవెంట్ మేనేజ్‌మెంట్ సామాగ్రి గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ మంటలు పక్కనే ఉన్న నివాస భవనాలకు కూడా వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 15 అగ్నిమాపక శకటాలు, క్యాట్స్ (CATS) అంబులెన్సులు సహాయక చర్యల్లో పాల్గొని మంటలను అదుపులోకి తెచ్చాయి. శనివారం రాత్రి కూడా నార్త్ వెస్ట్ ఢిల్లీలోని మజ్లిస్ పార్క్ ప్రాంతంలో ఒక ఇంట్లో మంటలు చెలరేగగా, ఐదు అగ్నిమాపక యంత్రాలు శ్రమించి మంటలను అదుపుచేశాయని, ఈ ప్రమాదాలలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande