కీలక.నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
కీలక.నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
కీలక.నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్


అమరావతి, 25 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ) కీలక నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల కోసం మూడు రోజుల గ్రాస్ శాలరీని వసూలు చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను సంస్థ యాజమాన్యం పూర్తిగా రద్దు చేసింది.

ఈ మేరకు జులై 16న జారీ చేసిన మెమోను రద్దు చేస్తూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. అరుణ్ బాబు తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల ముందస్తు అనుమతి లేకుండానే జీతం కోత ప్రతిపాదించడం సరైంది కాదని గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెమోలో పేర్కొన్నారు.

అలాగే, మూడు రోజుల జీతాన్ని ఉద్యోగుల సంక్షేమ నిధికి జమ చేయాలన్న ఆదేశాలు పూర్తిగా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. జీతం కోతకు సంబంధించిన అన్ని ఉత్తర్వులు తక్షణమే అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా హౌసింగ్ అధికారులకు ఎండీ ఆదేశాలు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఎండీ పి. అరుణ్ బాబు ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande