నేడు సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
నేడు సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
nandyal-banaganapalle-cm-chandrababu-naidu-visit-july-


కర్నూలు, 25 జూలై (హి.స.)

: ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్పరి మండల కేంద్రానికి శనివారం రానున్నారు. సీఎం పర్యటనకు సర్వం సిద్ధం చేశారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి జేసీ నూరుల్ ఖమర్తో కలిసి శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. సంజీవని కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించిన తర్వాత అవసరమైతే వర్చువల్ విధానంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులతో నేరుగా సంప్రదింపులు చేసే సౌకర్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. తద్వారా ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నిపుణుల సలహాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఐడీల నమోదు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను విస్తృతంగా చేపట్టారన్నారు. అదే విధంగా ప్రభుత్వం సురక్షిత మాతృత్వం, ఉమ్మడి పేరెంటింగ్ అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తోందన్నారు. గర్భాధారణ సమయంలో బాధ్యత తల్లిదే కాకుండా తండ్రిదీ సమానమనే భావనతో షేర్డ్ పేరెంటింగ్ పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. హెలిప్యాడ్, ప్రజావేదిక, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande