నైరుతి రుతుపవనాలు యాక్టివ్.. తెలంగాణలో వర్షాల జోరు
నైరుతి రుతుపవనాలు యాక్టివ్.. తెలంగాణలో వర్షాల జోరు
Rains


హైదరాబాద్, 27 జూలై (హి.స.)

వర్షాలు కురవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలంగాణ ప్రజలకు శుభవార్త అందింది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా మారడంతో వర్షాలు జోరు కొనసాగుతోంది. ఈ రోజు (జులై 27) తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నారాయణపేట జిల్లాలో కూడా విస్తారంగా మోస్తరు వర్షాలు పడతాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

ఇదిలా ఉంటే ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande