హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు
South Gujarat likely to receive heavy rain,


షిమ్లా, 28 జూలై (హి.స.)

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. రాజధాని షిమ్లా, సిర్మౌర్, చంబా, కాంగ్రా, మండి సహా పలు ప్రాంతాల్లో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.

రాబోయే 24 గంటల్లో 7 జిల్లాలలో (చంబా, కాంగ్రా, కుళ్లు, మండి, షిమ్లా, సిర్మౌర్ మరియు సోలన్) ఆకస్మిక వరదలు (Flash Floods), కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందంటూ షిమ్లా వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్, యెల్లో అలర్ట్‌లను కూడా ప్రకటించారు.

భారీ వర్షాల సూచన నేపథ్యంలో సిర్మౌర్ జిల్లాలోని పాంటా సాహిబ్ సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు (పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలు) స్థానిక యంత్రాంగం ముందస్తు జాగ్రత్తగా సెలవు ప్రకటించింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు, నదీ తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని మరియు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు ప్రజలను, పర్యాటకులను హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande