పెరిగిన రూపాయి విలువ.. డాలర్తో పోలిస్తే 12 పైసలు పెరిగి 95.70కి చేరిక!
పెరిగిన రూపాయి విలువ.. డాలర్తో పోలిస్తే 12 పైసలు పెరిగి 95.70కి చేరిక!
Stock market


ముంబై, 29 జూలై (హి.స.)

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ ప్రభావం తగ్గుముఖం పట్టడం, టెన్షన్ వాతావరణం లేకపోవడంతో భారత స్టాక్ మార్కెట్లలో సానుకూల ధోరణి, విదేశీ మూలధన ప్రవాహాల మద్దతు పెరిగింది. దీంతో బుధవారం ఉదయం ఎర్లీ ట్రేడింగ్ లో రూపాయి బలపడింది. బుధవారం నాటి ప్రారంభ వర్తకంలో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ 12 పైసలు పెరిగి 95.70కి చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుసరిస్తున్న వ్యూహాత్మక చర్యలు, క్రూడ్ ఆయిల్ ధరల ఊగిసలాట, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు రూపాయి విలువును ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. రానున్న రోజుల్లో రూపాయి మారకం విలువ 95.50 నుండి 96.25 శ్రేణిలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పశ్చిమాసియా వార్ టెన్షన్ తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 650 పాయింట్లు ఎగసి 77,420 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు లాభపడి 24,179 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. టెక్, టెలికం, బ్యాకింగ్ షేర్లు గ్రీన్లో ఉన్నాయి. అటు క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్రెంట్ ధర రూ.4.34% పెరిగి 87.77 డాలర్లకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపీ విలువ 95.85 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande