మహిళల మనీ ఇంకా హ్యాండ్ బ్యాగుల్లోనే
డెబిట్కార్డులు వినియోగించేది 30 శాతమే డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లోనూ వెనుకబాటు ప్రపంచ బ్యాంకు సర్వేలో వెల్లడి.
Women handling money


హైదరాబాద్, 29 జూలై (హి.స.)ప్రస్తుతం జేబులో లేదా పర్సులో డబ్బులు పెట్టుకొని తిరగడం తగ్గిపోతోంది. చేతిలో ఫోన్ ఉంటే ఎక్కడైనా చెల్లింపులు చేసేయొచ్చన్న ధీమాతో బజారుకెళ్లిపోతున్నారు. ఈ విషయంలో మహిళలు మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నారని ప్రపంచ బ్యాంకు తాజా అధ్యయనంలో వెల్లడైంది. వారిలో చాలామంది బ్యాంకు కార్యకలాపాలతోపాటు డెబిట్కార్డుల వినియోగం, డిజిటల్ చెల్లింపులకు దూరంగా ఉంటున్నారని తేలింది. యూపీఐ, నెట్, మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల వినియోగంలో దేశంలోని మహిళలు ఆశించిన పురోగతి సాధించడం లేదని ప్రపంచ బ్యాంకు ఇండెక్స్ గ్లోబల్ ఫిన్డెక్స్ డేటాబేస్ తాజా సర్వేలో వెల్లడైంది. సొంతంగా స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, ఇంటర్నెట్ డేటా ఖర్చులు, నెట్వర్క్ మౌలిక సదుపాయాల కొరత, డిజిటల్ నిరక్షరాస్యత తదితరాలే ఇందుకు ప్రధాన కారణాలని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. గతేడాది ఆగస్టు నుంచి డిసెంబరు వరకు కొనసాగిన ఈ సర్వేలో 3,086 కుటుంబాలను ప్రశ్నించి వివరాలు సేకరించారు. దాని ప్రకారం దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో మహిళలు, పురుషుల భాగస్వామ్యం తీరు ఇలా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande