భవిష్యత్తులో ఎల్కతుర్తి మరింత అభివృద్ధి.. మంత్రి పొన్నం ప్రభాకర్
భవిష్యత్తులో ఎల్కతుర్తి మరింత అభివృద్ధి.. మంత్రి పొన్నం ప్రభాకర్
Minister


హనుమకొండ, 06 జూలై (హి.స.) హనుమకొండ జిల్లా ఎలకతుర్థి

మండలం భవిష్యత్తులో అభివృద్ధిలో

మరింత ముందంజలో నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుండి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 13 కోట్లతో చేపట్టిన బీటి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కుడా వైస్ చైర్పర్సన్ & హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీలతో కలసి సోమవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామాలకు మండల కేంద్రానికి రహదారి అనుసంధానం (కనెక్టివిటీ) పెరుగుతుందన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రానికి కోర్టు, విద్యుత్ ఉపకేంద్రం, తహసీల్దార్ కార్యాలయాలు వస్తున్నాయన్నారు. తద్వారా ఎల్కతుర్తి మరింత అభివృద్ధిని భవిష్యత్తులో సాధిస్తుందన్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఈ రహదారి నిర్మాణం ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రహదారి నిర్మాణానికి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్డు నిర్మాణం కావాలని నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు దృష్టికి తీసుకువచ్చారని, దీంతో రహదారి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రహదారి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి కావాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande