
ములుగు, 06 జూలై (హి.స.) ములుగు జిల్లాలో పూర్తయిన
అభివృద్ధి పనులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు ఉంటాయని, త్వరలోనే ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో మొక్కలు నాటే విషయంలో అనుకున్న లక్ష్యాలను మించి మొక్కలు నాటాలని, అటవీ శాఖ అధికారులు విరిగా ప్రజలకు మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు.
సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ బోర్కేడ్ హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ వికాస్ మీనా, ఐటీడీఏ పీవో నవీన్ వత్సల్ టొప్పో లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టిన పల అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా శాఖ అధికారులు దృష్టి సారించాలని, అన్ని పనులు అనుకున్న సమయంలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలంలో జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. జిల్లాలోని పలు చెరువులకు గోదావరి జలాలను తరలించడానికి ఏర్పాటు చేయనున్న పైప్ లైన్ల ఏర్పాటు పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అన్న నమస్తే ప్రస్తుత వ్యవసాయ సాగు సందర్భంగా రైతులకు యూరియా కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..