సంగారెడ్డి కలెక్టరేట్ లో ఉద్రిక్తత.. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట
సంగారెడ్డి కలెక్టరేట్ లో ఉద్రిక్తత.. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట
Sangareddy


సంగారెడ్డి, 06 జూలై (హి.స.)

పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన జరిగింది. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ నుండి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు ఒక్కసారిగా చొచ్చుకుని వచ్చి కలెక్టరేట్ను ముట్టడించారు. కొద్దిసేపు కలెక్టరేట్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పోలీసులకు-విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ హోరెత్తింది, ఫీజులు విడుదల చేయాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్షులు టి. రాజేష్, జిల్లా కార్యదర్శి కె. సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగి విద్యార్థులను అదుపులోకి తెచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande