నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు బంగారం, వెండి ధరలను నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్ధంతో వీటి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 06:30 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో
Gold and silver prices fell in early trade in the bullion market


ముంబై, 21 ఆగస్టు (హి.స.)అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు బంగారం, వెండి ధరలను నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్ధంతో వీటి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఈరోజు (శుక్రవారం) ఉదయం 06:30 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,430గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,46,160కి చేరుకుంది.

ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,59,280కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,46,010కి చేరుకుంది. అలాగే, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,59,280ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,46,010గా ఉంది. ఇక, వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ.2,60,100కి చేరుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande