రాంచీ ఎయిర్పోర్టులో తీవ్ర రాజకీయ దుమారం: రాహుల్ గాంధీ హెలికాప్టర్ ఆలస్యంపై ప్రధాని మోదీపై ఖర్గే సంచలన ఆరోపణలు

హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)

రాంచీ, జార్ఖండ్ ప్రాంతం: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రాంచీ విమానాశ్రయం వేదికగా రాజకీయ వివాదం చెలరేగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రయాణించాల్సిన హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనల సాకుతో కావాలనే తమ హెలికాప్టర్‌ను గంటల తరబడి నిలిపివేశారని, కనీసం ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి కూడా తమకు ప్రవేశం కల్పించలేదని ఖర్గే ఆరోపించారు. ఎన్నికల వేళ బీజేపీ అధికార బలంతో ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande