పేదలు మధ్య తరగతి వారి శుభకార్యాలు చేసుకోవడానికి రూపాయికే ఫంక్షన్.హాల్
పేదలు మధ్య తరగతి వారి శుభకార్యాలు చేసుకోవడానికి రూపాయికే ఫంక్షన్.హాల్
పేదలు మధ్య తరగతి వారి శుభకార్యాలు చేసుకోవడానికి రూపాయికే ఫంక్షన్.హాల్

నెల్లూరు, 25 ఆగస్టు (హి.స.)

, ; నెల్లూరు(టౌన్) : పేదలు, మధ్య తరగతి వారు శుభకార్యాలు చేసుకోవడానికి రూపాయికే ఫంక్షన్హాల్ను నెల్లూరు నగరపాలక సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ హాల్ను ఆగస్టు 16న మంత్రి నారాయణ ప్రారంభించారు. అప్పుడే దీన్ని రూపాయికి అద్దెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హాలు మొత్తం సెంట్రల్ ఏసీ, టైల్స్తో కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. దీని సామర్థ్యం 5 వేలు కాగా, పార్కింగ్ సౌకర్యమూ ఉంది. ఎన్క్యాప్ నిధులు రూ.25 లక్షలు, కార్పొరేషన్కు చెందిన రూ.1.15 కోట్లు ఖర్చు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande