
నరసరావుపేట (పల్నాడు జిల్లా), 25 ఆగస్టు (హి.స.)
పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi