
హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) దేశవ్యాప్తంగా ‘నీట్ పీజీ 2026’ పరీక్ష ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఓ విద్యార్థి మద్యం తాగి పరీక్ష రాసేందుకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న అతన్ని సిబ్బంది గుర్తించి వెనక్కి పంపారు. దేశవ్యాప్తంగా 1300 కేంద్రాల్లో ఈ పీజీ పరీక్ష జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరగనుంది. నీట్ పరీక్ష నేపథ్యంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్