హైదరాబాద్లో అట్టహాసంగా ఎన్ఎండీసీ మారథాన్
దేశంలోనే అతిపెద్ద ఎన్ఎండీసీ మారథాన్ రన్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
NMDC


హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) దేశంలోనే అతిపెద్ద ఎన్ఎండీసీ మారథాన్ రన్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. దేశంలోని అనేక ప్రాంతాలు సహా విదేశాల నుంచి కూడా రన్నర్స్ వచ్చి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కే విభాగాల్లో రన్ కొనసాగింది. వేలాది మంది రన్నర్స్తో నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై హుస్సేన్ సాగర్ లేక్, లోక్భవన్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు మారథాన్ రన్ నిర్వహించారు. హాఫ్ మారథాన్ను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రారంభించారు. మారథాన్ దృష్ట్యా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande