భక్తజన సందోహంతో కిక్కిరిసిన తిరుమల.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమల


తిరుమల, 30 ఆగస్టు (హి.స.)తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది.

ఆపదమొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) భక్తులతో కిక్కిరిసిపోయింది. వీకెండ్ కావడంతో దేశం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం పెరిగింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లె్క్స్ (Vaikuntam Que Complex)లోని 20 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు నిన్న ఒక్కరోజే స్వామి వారిని 85,246 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,085 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.30 కోట్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande