నియోజకవర్గ అభివృద్ధికి కృషి.. పాల్గొన్న మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే
నియోజకవర్గ అభివృద్ధికి కృషి.. పాల్గొన్న మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే
Mp


సిద్దిపేట, 31 ఆగస్టు (హి.స.)

నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు నిర్మించిన నూతన ప్రహరీ గొడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరుగుతున్నారు. అనంతరం మండలంలో భూంపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య ఆవరణలో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మహిళా భవనాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు, సమావేశాలకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నూతనంగా మంజూరైన ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా పోలీసుల బందోబస్త్ మధ్య జరిగేవి, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదాలు జరిగిన సంఘటలు ఉన్నాయి, అందుకు భిన్నంగా ఈ రోజు కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరగడం గమనర్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande