విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం : దేవరకద్ర ఎమ్మెల్యే
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం : దేవరకద్ర ఎమ్మెల్యే
Mla


నల్గొండ, 31 ఆగస్టు (హి.స.)

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్ర మండలం గూరకొండ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ విద్యలో వెనుకబడిన విద్యార్థుల కోసం ఏఐ టెక్నాలజీతో కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవరకద్ర మండలంలో ఇప్పటికే ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట వేశామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దసరా నుంచి విద్యార్థుల కోసం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తాను కష్టపడి చదువుకొని న్యాయవాదిగా స్థిరపడి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పారు. విద్యార్థులు కూడా జీవితంలో కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande