
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ,
బ్యాంకింగ్, డిజిటల్ సేవలకు ఇకపై ఒకే రకమైన సమయం నమోదయ్యేలా కేంద్ర ప్రభుత్వం (Government Of India) అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (IST)ని ఏకైక ప్రామాణిక సమయంగా గుర్తిస్తూ లీగల్ మెట్రాలజీ-2026 నిబంధనల మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. అయితే, అధికారిక గెజిట్లో ప్రచురించిన 180 రోజుల తర్వాత ఇవి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ శాఖలు, పారిశ్రామిక రంగాలు, సాంకేతిక సంస్థలు తమ నెట్వర్క్లను కొత్త వ్యవస్థకు అనుగుణంగా మార్చుకోవడానికి ఈ సమయాన్ని కేటాయించారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, టెలి కమ్యూనికేషన్స్, రైల్వేలు, విమానయానం, పవర్ గ్రిడ్లు, కంప్యూటర్ నెట్వర్క్ు ప్రస్తుతం వేర్వేరు సమయ వనరులపై ఆధారపడటం వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడానికే 'ఇండియన్ స్టాండర్డ్ టైమ్' తీసుకువచ్చారు.
విదేశీ శాటిలైట్కు ఇక స్వస్తి..
ప్రస్తుతం దేశంలోని అనేక కీలక రంగాలు విదేశీ శాటిలైట్ ఆధారిత సమయ వనరులపై ఆధారపడుతున్నాయి. దీంతో ఆ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి భారతీయ సంస్థలు, లీగల్ మెట్రాలజీ లాబొరేటరీల ద్వారా కచ్చితమైన ఐఎస్టిని అందించేందుకు ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంది. ఇందులో భాగంగానే భారత్ స్వదేశీ శాలిటైట్ నావిగేషన్ వ్యవస్థ అయిన 'నావిక్' (NavIC)తో పాటు ఆమోదించబడిన ఇతర భారతీయ టైమింగ్ వనరులను సురక్షితమైన సమయ ప్రసారం కోసం ఉపయోగించనున్నారు. 'ఇండియన్ స్టాండర్డ్ టైమ్' తప్పనిసరి చేయడంతో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు జరిపే సమయంలో ప్రతీ సెకను సమయం కచ్చితంగా నమోదవుతుంది. దీంతో ఆన్లైన్ ఆర్థిక మోసాలు, సాంకేతిక లోపాల విచారణ సులభం అవుతోంది. ముఖ్యంగా రైల్వేలు, విమానాలు, బస్సుల రాకపోకల సమయాల్లో వ్యత్యాసాలు లేకుండా సిస్టమ్స్ అన్నీ ఒకే సమయంతో సింగ్ అవుతాయి. అదేవిధంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలు, ఇంటర్నెట్ నెట్వర్క్స్, సైబర్ భద్రతా లాగ్స్ కరెక్ట్ టైమ్తో సైబర్ దాడుల ముప్పు భారీగా తగ్గనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..