2027 ఏప్రిల్ నాటికి గద్వాల రైల్వే అభివృద్ధి పనులు పూర్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
2027 ఏప్రిల్ నాటికి గద్వాల రైల్వే అభివృద్ధి పనులు పూర్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి


జోగులాంబ గద్వాల, 31 ఆగస్టు (హి.స.)

దేశవ్యాప్తంగా రైల్వే రంగంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గనులు, బొగ్గు మరియు టూరిజం శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సోమవారం గద్వాల రైల్వే స్టేషన్ను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 12 ఏళ్లలో రైల్వే రంగంలో గణనీయమైన ప్రగతి సాధించామని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి ఏడాదికి సుమారు రూ.886 కోట్ల నిధులు ఖర్చు చేయగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2025-26లోనే రూ.5,454 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో 2009 నుంచి 2014 వరకు సంవత్సరానికి సగటున 87 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు వేయగా, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది సగటున 888 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. తెలంగాణలో రైల్వే క్రాసింగ్ వద్ద ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం 520 ఆర్బ్బీలు, ఆరాయూబీల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి 100 కొత్త రైళ్లను మంజూరు చేసినట్లు కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులను పూర్తి చేశామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణలోని 174 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ ఉచిత వైఫై సదుపాయం కల్పించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మంజూరైన 7 వందేభారత్ రైళ్లలో మూడు రైళ్లను తెలంగాణకు కేటాయించినట్లు తెలిపారు. కాజీపేటలో నూతన జనరేషన్కు అనుగుణంగా ఆధునిక రైళ్ల తయారీకి సంబంధించిన ఏర్పాట్లు రైల్వే శాఖ చేపట్టబోతోందన్నారు. రైల్వే ప్రమాదాల నివారణకు 'కవచ్' సాంకేతికతను తెలంగాణలో పైలట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నట్లు తెలిపారు.

గద్వాల పట్టణానికి మరో కీలక రైల్వే సదుపాయం రానుందని కిషన్రెడ్డి వెల్లడించారు. బీరెల్లి రోడ్డు మార్గంలో సుమారు రూ.66 కోట్లతో మరో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్బీబీ) నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గద్వాల రైల్వే స్టేషన్లో ప్రతిరోజూ సుమారు 7 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, ప్రస్తుతం 34 రైళ్లకు గద్వాల స్టేషన్లో హాల్ట్ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా గద్వాల రైల్వే స్టేషన్ను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్టేషన్లో మూడు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు ఏర్పాటు చేయడంతో పాటు రెండు ప్లాట్ఫారాలను ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. గద్వాల రైల్వే స్టేషన్కు వందేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు. గద్వాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను 2027 ఏప్రిల్ నాటికి పూర్తి

చేసేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande