పెను విషాదం..బీచ్లో డ్రోన్ దాడి, ఏడుగురు మృతి
పెను విషాదం..బీచ్లో డ్రోన్ దాడి, ఏడుగురు మృతి
russia-says-ukrainian-drone-attack-on-holiday-makers-killed-seven-includin


రష్యా, 04 ఆగస్టు (హి.స.) రష్యాలో పెను విషాదం చోటు చేసుకుంది. రష్యాలోని రద్దీ బీచ్ లో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ సంఘటనలో ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 9 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. గెలెండ్ జిక్ ప్రాంతంలోని ఆర్ఖిపో-ఒసిపోవ్కా బీచ్ లో ఈ డ్రోన్ దాడి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పేలుడు ఒక్కసారిగా సంభవించడం, టూరిస్టులు పరుగులు తీయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అటు ఈ దాడిని రష్యా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్ ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దొంగ దెబ్బతీయడం కాదని.. ఏదైనా ఉంటే నేరుగా చూసుకోవాలని సవాల్ విసిరింది. అనవసరంగా యాత్రికుల జీవితాలతో ఆడుకోకూడదని హెచ్చరించింది. ఈ దాడికి ప్రతి దాడికి కచ్చితంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది రష్యా.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande