బేగంబజార్లో 3.8 లక్షల వజ్రాలతో కొలువుదీరిన వినాయకుడు
హైదరాబాద్ బేగంబజార్లో 24 క్యారెట్ల బంగారంతో, 3.8 లక్షల అమెరికన్ డైమండ్లతో కొలువుదీరిన గణపయ్య విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టకుంటోంది. దీన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.
Ganesh chaturthi


హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.) నగరంలో ఈ సంవత్సరం బేగంబజార్లో గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 24 క్యారెట్ల బంగారంతో, 3 లక్షల 83 వేల అమెరికన్ డైమండ్లతో తయారు చేసిన ఈ గణపయ్య విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

బేగంబజార్లోని లీచీ పర్ల్ సెట్ జ్యువెలరీ షాపులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఈ బంగారు గణపయ్య దర్శనమిస్తున్నాడు. వజ్రాలతో కొలువుదీరిన గణేశుణ్ని చూసి తరించడానికి భక్తులు తరలి వస్తున్నారు. బంగారు నిగనిగలతో, వజ్రాల ధగధగలతో వెలిగిపోతున్న వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు.

జ్యువెలరీ షాపు యజమాని ఆధార్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి కోసం ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా చేయించామని చెప్పారు. గత రెండేళ్లుగా తమ షాపులో గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సారి దశావతారాన్ని గుర్తు చేసేలా విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. ఈ విగ్రహాన్ని చేయడానికి 8 మంది నిపుణులు 8 నెలల పాటు కష్టపడ్డారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande