తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన... ఎస్వీ మ్యూజియం, ఈవీ బస్సులను ప్రారంభించిన చంద్రబాబు
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన... ఎస్వీ మ్యూజియం, ఈవీ బస్సులను ప్రారంభించిన చంద్రబాబు
Tirumala Devotees Get Big Relief: 32 New Electric Bus


తిరుమల, 16 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.అనంతరం తిరుమలలో సీఎం చంద్రబాబు ఉచిత ధర్మరథం బస్సులను ప్రారంభించారు.

రిలయన్స్, భారత్ బయోటెక్ సంస్థలు ఈవీ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందించాయి.

తిరుమలలో ఎస్వీ మ్యూజియంనుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవోలతో కలిసి ఎస్వీ మ్యూజియంలో విశేషాలను పరిశీలించారు. ఎస్వీ మ్యూజియంలో జీ+3 అంతస్తులు, 19 గ్యాలరీలు, 14 వేల కళాఖండాలు ఉన్నాయి. బస్సులను ప్రారంభించిన అనంతరం ఓ ఈవీ బస్సులో నారాయణగిరి సర్కిల్ నుంచి మ్యూజియం వరకూ చంద్రబాబు ప్రయాణించారు.

. ప్రస్తుతం తిరుమలలో కొన్ని బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీకి బస్సులు సరిపోవడం లేదు. దీంతో ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు భక్తులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో.. తర్వాతి బస్సు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ బాధలు తప్పనున్నాయి.

మరోవైపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు చిన్నశేష వాహనం వైభవంగా సాగింది. మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై పాండురంగస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరు వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో 28 రాష్ట్రాల కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. రాత్రి 7 గంటలకు హంస వాహనసేవ జరుగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande