ఎర్రవల్లి ప్రాంతంలో భూములకు ప్రత్యేక దర్యాప్తు ప్రక్రియ ప్రారంభం
సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ప్రాంతంలో భూములకు సంబంధించి ఆరోపణలు రావడంతో రాష్ట్ర అధికారులు ప్రత్యేక దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించారు.
Kcr


తెలంగాణ , 18 సెప్టెంబర్ (హి.స.)సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ప్రాంతంలో భూములకు సంబంధించి ఆరోపణలు రావడంతో రాష్ట్ర అధికారులు ప్రత్యేక దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 388 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు 30 రోజుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుకు సిద్ధం చేసింది ప్రభుత్వం.

ఈ వ్యవహారంలో భూముల రికార్డులు, వాటి కేటాయింపు, వినియోగం, ప్రస్తుత స్థితి తదితర అంశాలను అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. భూములకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులు, రెవెన్యూ వివరాలు, స్థానికంగా ఉన్న హక్కులు వంటి అంశాలు విచారణలో భాగం కావచ్చు. ఇప్పటికే సంబంధిత ప్రాంతాల్లో అధికారులు భూముల సర్వే చేపట్టినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande