
అనంతపురం, 18 సెప్టెంబర్ (హి.స.) అనంతపురం ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవ పౌరుషాన్ని కాపాడే విధంగా తాను త్వరలో పార్టీ పెడుతున్నానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
ఈ రోజు శుక్రవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ రాయలసీమ ఒరిజినల్ రెడ్ల పౌరుషాన్ని కాపాడే పార్టీగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
రాయలసీమపై ఆ రెండు కుటుంబాలకు ప్రేమ లేదని.. ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ కోసం రక్తం చిందిస్తామని గ్రామ గ్రామాన చెబుతున్నారని… ఆ రెండు కుటుంబాల కోసం కాకుండా గ్రామాలు, రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీభాగ్ ఒడంబడిక ఏమయ్యిందో చంద్రబాబు, జగన్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. రాయలసీమలో ఉపాధి కరువై ఇక్కడి ప్రజలు వలసలు పోతున్నారని చెప్పుకొచ్చారు. కొత్త తరం రాజకీయాల్లోకి రావాలని కోరారు. రెండు కుటుంబాలు ఉన్నంత కాలం రాష్ట్రం బాగుపడదని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV