
హైదరాబాద్ , 29 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ వ్యవసాయ రంగంలో ఆయిల్పామ్ సాగును విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్పామ్ కంపెనీల పనితీరుపై తీవ్రంగా స్పందిస్తూ, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే వారికి కేటాయించిన జిల్లాలను ఉపసంహరించుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆయిల్ఫెడ్ ప్రధాన కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఏడాదికి రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు తీసుకురావాలనే లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరియు, పెండింగ్లో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రైతులకు ఆయిల్పామ్ మొక్కలను సకాలంలో పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్పామ్ పంటను దీర్ఘకాలిక వ్యవసాయ పెట్టుబడిగా రైతులు పరిగణిస్తారు. అందువల్ల మొక్కలు నాటిన తర్వాత మార్కెటింగ్, కొనుగోలు, ధర, ప్రాసెసింగ్ వంటి అంశాల్లో సంస్థల పాత్ర కీలకం.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్