తెలంగాణలో 45.54 లక్షల ఓటర్లపై విచారణలు పూర్తి
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలకమైన పురోగతి నమోదైంది. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా వచ్చిన అభ్యంతరాలు, నోటీసులు, విచారణల అనంతరం 45.54 లక్షల మంది ఓటర్లను తుది జాబితాలో కొనసాగించేందుకు క్లియరెన్స్ లభించింది.
Vote


హైదరాబాద్ , 29 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలకమైన పురోగతి నమోదైంది. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా వచ్చిన అభ్యంతరాలు, నోటీసులు, విచారణల అనంతరం 45.54 లక్షల మంది ఓటర్లను తుది జాబితాలో కొనసాగించేందుకు క్లియరెన్స్ లభించింది.

ఈ ప్రక్రియలో ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున నోటీసులు జారీ చేసి, వాటి పంపిణీ, విచారణలు, క్లెయిమ్లు మరియు అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు.

తాజా వివరాల ప్రకారం సోమవారం నాటికి 92,88,180 నోటీసులు రూపొందించగా, వాటిలో 87,85,739 నోటీసులు సంబంధిత ఓటర్లకు అందించారు. మిగిలిన నోటీసుల విషయంలో కూడా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. ఓటర్ల చిరునామాలు, అర్హతలు, రికార్డుల్లో ఉన్న వివరాలు వంటి అంశాలను పరిశీలించడం ద్వారా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ప్రక్రియకు సంబంధించి అధికార యంత్రాంగం బూత్ లెవల్ అధికారుల పాత్రను కీలకంగా చూస్తోంది. ఓటర్లకు నోటీసులు అందించడం మాత్రమే కాకుండా, వారి క్లెయిమ్లు మరియు అభ్యంతరాలను నిర్ణీత సమయంలో పరిశీలించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీల నుంచి కూడా ఓటర్ల జాబితా సవరణపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా ఎన్నికల అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి ఓటరుకు తన వివరాలను సరిచూసుకునే అవకాశం ఉండటం, తప్పులు ఉంటే సరిదిద్దుకునే ప్రక్రియ అందుబాటులో ఉండటం ఈ దశలో ప్రాధాన్యం సంతరించుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande