సెప్టెంబర్ 6న ఎర్రవల్లిలో బీఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం
ఈ నెల 06 న ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
BRS


తెలంగాణ , 04 సెప్టెంబర్ (హి.స.)ఈ నెల 06 న ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ 07 వ తేదీ నుంచి రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్ననేపథ్యంలో ఈ సమావేశం పెట్టనున్నారు కేసీఆర్.

మధ్యాహ్నం 1 గంటకు లంచ్ అనంతరం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande