
తెలంగాణ , 04 సెప్టెంబర్ (హి.స.)బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇచ్చోడ విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడించి వంటా వార్పుతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రైతులతో కలిసి ఉరి తాడుతో వినూత్న నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం , ఇప్పుడు రైతులను కరెంట్ కోతలతో ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్