
తెలంగాణ , 04 సెప్టెంబర్ (హి.స.)ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ఆహ్వానం అందింది. యూరప్లో స్టార్టప్లు, వెంచర్ క్యాపిటల్, పెట్టుబడుల రంగాలకు సంబంధించిన ప్రముఖ కార్యక్రమం లక్సెంబర్గ్ వెంచర్ డేస్-2026లో కీలకోపన్యాసం చేయాలని నిర్వాహకులు కేటీఆర్ను ఆహ్వానించారు. లక్సెంబర్గ్లో అక్టోబర్ 14, 15 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్