
Andhra pradesh, 05 సెప్టెంబర్ (హి.స.) తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం ఆంధ్రా పేపర్ మిల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని గుర్తించేందుకు తాజాగా నమూనాలు తీసి పంపినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక కమిటీ ద్వారా ఆంధ్రా పేపర్ మిల్ కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.
పవన్ కల్యాణ్ గతంలో రాజమహేంద్రవరం వచ్చినప్పుడు పేపర్ మిల్ కాలుష్యాన్ని నిగ్గు తేల్చారని, కాలుష్యంపై జాగ్రత్తలు తీసుకోవడానికి చాలా సమయం ఇచ్చామన్నారు. ఇప్పటికీ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న మంత్రి రాజమహేంద్రవరం కార్పొరేషన్ కు పన్నులు కూడా కట్టడం లేదని మండిపడ్డారు. కడియం పేపర్ మిల్లు 70 మందిని రోడ్డున పడేసిందని, కార్మికుల పొట్టగొడుతున్నారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్