
అమరావతి , 05 సెప్టెంబర్ (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. రెండు డీఏలను అక్టోబర్ 1 నుంచి చెల్లించడంతో పాటు పీఆర్ సీ ఛైర్మన్ నియామకానికి సీఎం అంగీకరించారు. ఒక సరెండర్ లీవ్, పోలీసులకు అదనంగా మరో సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపునకు సరేనన్నారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్