విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరం.....జస్టిస్ ఉజ్జల్ భుయాన్
ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులు, ప్రదర్శనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు.
Justice Ujjal Bhuyan


ఢిల్లీ , 05 సెప్టెంబర్ (హి.స.)ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులు, ప్రదర్శనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. గత జులై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల పై జరిగిన దాడి పై అయన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ వైస్రాయ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ భద్రతా వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి యశోవర్ధన్ ఆజాద్ రచించిన 'పోలీసింగ్ ది రిపబ్లిక్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ భుయాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రదర్శనకారులపై ఇండియన్ పోలీస్ సర్వీసుకు చెందిన యువ అధికారులు దాడి చేయడం బాధాకరమైన విషయం అన్నారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే పోలీసుల్లో నిష్పాక్షికత నశించిపోతున్నట్టుగా అనిపిస్తోందన్నారు. పోలీసు యంత్రాంగం తమ విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు రాజ్యాంగానికి బద్ధులైనప్పుడే లాకప్ డెత్ లు, లాకప్ లో చిత్రహింసలు నిలుస్తాయి. మణిపుర్ రాష్ట్రంలో జరిగిన హింస జాతి మొత్తానికి ఒక గుణపాఠం కావాలి' అని భుయాన్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande