
ఢిల్లీ , 05 సెప్టెంబర్ (హి.స.)ఉత్తరాఖండ్ బీజేపీ నేతలు, ఇతరులపై బెంగళూరులోని విధాన సౌధ పోలీసులు ఆగస్టు 31న 'జీరో ఎఫ్ఐఆర్' నమోదు చేశారు. హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభా వేదికను 'శుద్ధీకరించిన' ఘటనకు సంబంధించిన విషయంలో కీలక పరిణామం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టీ (ST) విభాగం మాజీ వైస్ ఛైర్మన్ టీఆర్ రామప్ప ఫిర్యాదు మేరకు బీజేపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆగస్టు 8న నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో ఉన్న రామ్లీలా మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించారని టీఆర్ రామప్ప పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బహిరంగ సభ శాంతియుతమైన, చట్టబద్ధమైన ప్రజాస్వామ్య సమావేశమని తెలిపారు. ఖర్గే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల, ఆయన సభ నిర్వహించిన ప్రదేశం అపవిత్రం అయిందని ఉద్దేశంతో శుద్ధీకరించారని ఫిర్యాదుదారు ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్