ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం.
accident


త్రిస్సూర్, 05 సెప్టెంబర్ (హి.స.) కేరళం రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా పరిధిలో పెను విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థులతో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.

ఈ భయానక ప్రమాద దాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న 8 మంది విద్యార్థులు తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శబ్దాలు విని స్థానికులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతికష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన వారంతా తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. వీరు విహారయాత్ర కోసం కేరళకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande