గురువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.... సీఎం చంద్రబాబు నాయుడు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని గురువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
sarvepalli-radhakrishnans-exemplary-life-cm-chandrababu-exten


అమరావతి, 05 సెప్టెంబర్ (హి.స.) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని గురువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. భావి భారత పౌరులను సమాజానికి అందిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రతి ఒక్క టీచర్కు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.

విద్యారంగంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనదని కొనియాడారు. దేశ మాజీ రాష్ట్రపతి, గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన జీవితాన్ని సీఎం స్మరించుకున్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ అత్యంత సాధారణ స్థితి నుంచి ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి దేశంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande