యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు స్పాట్ డెడ్
ముజఫ్ఫర్నగర్, 1 అక్టోబర్ (హి.స.) ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్నగర్లో నేడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిపిన ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. హర్యానా కర్నాల్ జిల్లాకు చెందిన మోహిందర్ అనే వ్యక్తి చనిపో
యాక్సిడెంట్


ముజఫ్ఫర్నగర్, 1 అక్టోబర్ (హి.స.) ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్నగర్లో నేడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిపిన ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. హర్యానా కర్నాల్ జిల్లాకు చెందిన మోహిందర్ అనే వ్యక్తి చనిపోగా.. ఆయన అస్తికలు గంగలో కలిపేందుకు హరిద్వార్కు వెళ్తున్నారు హరియానా కర్నాల్ జిల్లాకు చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో అతివేగం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడంతో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా ట్రక్కు డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు నిలిపిన స్థలం, ప్రమాదం జరిగిన కారణాలపై పరిశీలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande