బెయిలు మంజూరీలో లొసుగులు.. జడ్జీలకు పునశ్చరణ దండన విధించిన సుప్రీం
దిల్లీ: 1 అక్టోబర్ (హి.స.)దాదాపు రూ. 2 కోట్ల మేర మోసం చేసిన ఒక వివాహిత జంటకు లోపభూయిష్టమైన రీతిలో బెయిలు మంజూరు చేయడం ద్వారా చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు న్యాయాధికారులకు సుప్రీంకోర్టు అరుదైన దండన విధించింది. లోపాలతో కూడుకున్న ఆదేశాలు వెలువరించ
Supreme Court


దిల్లీ: 1 అక్టోబర్ (హి.స.)దాదాపు రూ. 2 కోట్ల మేర మోసం చేసిన ఒక వివాహిత జంటకు లోపభూయిష్టమైన రీతిలో బెయిలు మంజూరు చేయడం ద్వారా చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు న్యాయాధికారులకు సుప్రీంకోర్టు అరుదైన దండన విధించింది. లోపాలతో కూడుకున్న ఆదేశాలు వెలువరించే తప్పిదానికి పాల్పడిన దిల్లీ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ (ఏసీఎంఎం), సెషన్స్‌ జడ్జీలు వారం పాటు దిల్లీ జ్యుడీషియల్‌ అకాడమీలో పునశ్చరణ శిక్షణ తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయంలో విచారణ అధికారులనూ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వారి వ్యవహార సరళిపై విచారణ జరపాల్సిందిగా దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది.

ఈ కేసు 2017లో శిక్షా రాథోడ్, ఆమె భర్త నెట్‌సిటీ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ నుంచి రూ 1.9 కోట్లు తీసుకొని అందుకు బదులుగా తమ భూమిని ఇస్తామని హామీ ఇచ్చారు.

ఫిర్యాదుదారుకు రూ 6.25 కోట్ల పరిహారం చెల్లిస్తామన్న నిందితులు మాట తప్పారు. ఇందుకు సంబంధించి నిందితులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు దరఖాస్తును దిల్లీ హైకోర్టు 2023, ఫిబ్రవరి 1న తిరస్కరించింది. హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించినా అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ నిందితులకు సాధారణ బెయిలు మంజూరు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande