ముంబై, 1 అక్టోబర్ (హి.స.)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)రాకతో సెలబ్రిటీలు ఆందోళనకు గురవుతున్నారు. తమ వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బచ్చన్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది. గూగుల్ కంపెనీపై దావా వేసింది. యూట్యూబ్ లాంటి వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్క అనుమతి లేకుండానే తమ స్వరాన్ని, ఇమేజ్లను వాడుతున్నట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్.. గూగుల్ కంపెనీపై సుమారు నాలుగున్నర లక్షల డాలర్ల నష్టపరిహారం కేసు దాఖలు చేశారు. మేథో సంపత్తి హక్కులను దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ఆ జంట ఆరోపించింది. అలాంటి వీడియోలను తొలగించాలని జడ్జీని కోరారు. డీపేఫేక్ వీడియోలతో ఇతర ఏఐ మోడల్స్ కూడా కలుషితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. అయితే జనవరి 15వ తేదీన జరిగే తదుపరి విచారణ లోపే స్పందన ఇవ్వాలని గూగుల్ లాయర్కు హైకోర్టు ఆదేశించింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు