బీజాపూర్ 1 అక్టోబర్ (హి.స.) ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టుల కుట్రను భగ్నం చేయడంలో విజయం సాధించాయి. పామెడ్ ప్రాంతంలోని కౌరగుట్ట అడవుల్లో కోబ్రా 208 బెటాలియన్ ఇటీలి కాలంలో ముమ్మరంగా మావోయిస్టుల కోసం గాలిస్తోంది. ఈ నేపధ్యంలో మావోయిస్టులు పెద్ద మొత్తంలో దాచిపెట్టిన పేలుడు పదార్థాలను, రోజువారీ ఉపయోగించే వస్తువుల డంప్‌ను బెటాలియన్ స్వాధీనం చేసుకుంది.
ఈ పేలుడు పదార్థాలను కోబ్రా 208 బెటాలియన్ కాంచల్ గ్రామ అడవుల్లోని ఒక గొయ్యిలో కనుగొంది. ఈ పేలుడు పదార్థాలను మావోయిస్టులు ఏదో భారీ కుట్ర కోసం సేకరించారని భద్రతా దళాలు భావిస్తున్నాయి. కోబ్రా 208 బెటాలియన్ సకాలంలో అప్రమత్తం కావడంతో మావోయిస్టుల కుట్ర విఫలమయ్యిందని ‘హరిభూమి’ తన కథనంలో పేర్కొంది.
నక్సలైట్ల స్థావరం నుండి భద్రతా దళాలు.. గన్ పౌడర్, బీజీఎల్ సెల్స్, కార్డెక్స్ వైర్, బీజీఎల్ రౌండ్లు, ఆర్డీఎక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, బాణసంచా, బారెల్స్‌లో ఉపయోగించే ఇనుప రాడ్‌లు, ఇంప్రూవైజ్డ్ గ్రెనేడ్‌లు, క్రిస్టల్ షుగర్, రైఫిల్ బోనెట్‌లు, ఇనుప పటకారు, ఇనుప రాడ్‌లు, ఇనుప కట్టర్లు, బ్యాటరీలు, సోలార్ ఇన్వర్టర్లు, లిథియం బ్యాటరీలు, స్పూల్ వైర్లు రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ