హైకోర్టు సంచలన తీర్పు.. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నా.. పోక్సో కేసు రద్దు కాదు!
దిల్లీ: 1 అక్టోబర్ (హి.స.) మైనర్ లపై అత్యాచారాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. తాజాగా బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చ
బాంబే హైకోర్టు


దిల్లీ: 1 అక్టోబర్ (హి.స.) మైనర్ లపై అత్యాచారాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. తాజాగా బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నా పోక్సో కోసు రద్దు కాదని కోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన 29 ఏళ్ల యువకుడు తనపై నమోదైన రేప్‌ కేసును రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ తిరస్కరించింది.

ముంబైలో ఒక 17ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 29 ఏళ్ల యువకుడు. దీంతో బాధితురాలు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే కేసు దర్యాప్తులో ఉండగానే నిందితుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వారు మగ బిడ్డ జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో కేసు వాపస్ తీసుకునేందుకు బాధితురాలు అంగీకరించింది. ఈ విషయమై యువకుడు హైకోర్టును ఆశ్రయించగా.. మైనర్‌ను వివాహం చేసుకున్నా పోక్సో చట్టం కింద నమోదైన అత్యాచారం కేసుల నుంచి నిందితుడికి విముక్తి లభించదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande