ఢిల్లీ, , 1 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు (Centenary celebrations)ను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా.. ఈ రోజు ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని మోడీ (Prime Minister Modi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఆయన తపాలా బిళ్ల, నాణెంను విడుదల చేశారు.
అనంతరం ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. వందేళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్.. ఆర్ఎస్ఎస్ సేవకులకు అభినందనలు తెలిపారు. అలాగే గత వందేళ్లలో ఆర్ఎస్ఎస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు.
ఆర్ఎస్ఎస్ అంటే విజయమని ఆర్ఎస్ఎస్‌కు దేశమే ముఖ్యమని, దేశానికి సేవ చేసేందుకు సంఘ్ ఎప్పుడూ ముందుంటుందని, దేశమే ప్రథమం అనేది ఆర్ఎస్ఎస్ విధానమని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు కురిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV