హుజురాబాద్, 10 అక్టోబర్ (హి.స.)
బీ ఫారాలను నేనే ఇస్తా ఇక్కడ 25 ఏళ్ల నుంచి నేనే లీడర్ను అని బిజెపి పార్టీ నాయకులు, ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో బీజేపీ పార్టీకి సంబంధించిన బి ఫారం లు ఎవరిస్తారు అనే విషయంపై ఈటెల రాజేందర్ కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో గందరగోళం సృష్టించిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారని, వంచించారని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి గందరగోళం సృష్టించారని ఈటల రాజేందర్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి సపోర్ట్ చేసిందని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ, చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ అంశం అబాసుపాలైందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు