కొత్తగూడెం సిగలో మరో 'మణిహారం'.. నెరవేరిన జిల్లా వాసుల కల
భద్రాద్రి కొత్తగూడెం, 11 అక్టోబర్ (హి.స.) పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణంలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆవరణలో మరో మణిహారంగా ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కానుందని కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు త
కొత్తగూడెం


భద్రాద్రి కొత్తగూడెం, 11 అక్టోబర్ (హి.స.)

పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ

పట్టణంలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆవరణలో మరో మణిహారంగా ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కానుందని కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు తెలియజేశారు. వారు నేడు పాల్వంచలో మాట్లాడుతూ.. అందుకోసం అన్ని రకాల అనుమతులు లభించాయి. కే.టి.పి.ఎస్ ఆవరణలో ఉన్న పాత ప్లాంట్ ను గతంలో అధికారులు తొలగించారు తొలగించిన ప్లాంట్ల స్థానంలో కొత్త ప్లాంట్ నిర్మాణం చేయాలని గత కొన్నేళ్లుగా ఇంజనీర్లు కార్మికులు జిల్లా ప్రజలు పోరాటం చేస్తున్నారు. డిప్యూటేషన్ పై వేరే పవర్ స్టేషన్లకు వెళ్లిపోవడంతో ఇక్కడ కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వారందరిని మరల ఈ ప్లాంట్ లోనే విధులు కేటాయించాలని పలుమార్లు విన్నవించారన్నారు.

అయితే ఎట్టకేలకు కొత్త ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి అన్ని రకాల అనుమతులు లభించడంతో జిల్లా వాసుల ఆశలు చిగురించాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande