ఇసుక లారీలతో పరేషాన్.. నిలిచిపోయిన ట్రాఫిక్
భద్రాద్రి కొత్తగూడెం, 11 అక్టోబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండల కేంద్రంలో శనివారం ఉదయ నుంచి ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. మండల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఆర్ టి సి బస్సు, తెలంగాణ లో మార్
ఇసుక లారీలు


భద్రాద్రి కొత్తగూడెం, 11 అక్టోబర్ (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండల కేంద్రంలో శనివారం ఉదయ నుంచి ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. మండల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఆర్ టి సి బస్సు, తెలంగాణ లో మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నా చర్ల మండల ప్రజలు. కనీస అవసరాలకు కూడా బయటకు పోలేని పరిస్థితిలో మండల వాసులు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక లారీలు తిరుగుతున్నాయి. మరోవైపు రహదారి మొత్తం గుంతలు మాయంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఉదయం ఇసుక లారీలతో వాహనాదారులు, ఉద్యోగస్థులు ఆర్టీసీ ప్రయాణికులు వారి గమ్యానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande