హైదరాబాద్, 11 అక్టోబర్ (హి.స.)
70 ఏళ్లుగా గ్రామాలు మారలేదు..
వాళ్ళ బతుకులు మారలేదు సార్. వీరోస్తే చేస్తారు.. వారొస్తే చేస్తారు.. అని ఓట్లేసి ఎదురు చూడడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా గ్రామాలు కూడా ఇప్పటికీ అలానే ఉన్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు సోషల్ మీడియా గ్రూపులో వైరల్గా మారినది. అధికారంలో ఉన్నవారు చేయకపోగా గెలిస్తే చేస్తామని వచ్చిన వారు గెలిసి రెండేళ్లయినా చేయడం లేదని చర్చ జరుగుతున్నది. 20 ఏళ్ల నుంచి ఓట్లు వేయించుకొని పొట్టి మర్రి కట్ట రోడ్డు వెడల్పు చేయలేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ డైలాగ్తో అన్ని పార్టీల నేతల లైకులు, ప్రశ్నలు, జవాబులతో చర్చ జరుగుతున్నది. రాజకీయ నాయకులు సక్రమంగానే ఉన్నారు. ప్రజలు ఓట్లు అమ్ముకున్నన్నీ రోజులు అభివృద్ధి ఆమడ దూరంలో ఉంటది. ఇక్కడ ఎవరినీ తప్పుపట్టలేం అని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు