హైదరాబాద్, 10 అక్టోబర్ (హి.స.)
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం టీఎస్ఐఐసి కాలనీలోని కాప్రా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో చేపట్టిన వ్యక్తిగత ప్రమాద బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. వార్తా సేకరణలో పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా బాధ్యతలు నిర్వహిస్తూ సమాజానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారన్నారు. అయితే విలువలతో పనిచేసిన జర్నలిస్టులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులు అన్యాయాన్ని ఎదిరించి పేద ప్రజలకు అండగా ఉండాలని ఆయన సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..